Gossipsఎన్టీఆర్ బయోపిక్ సర్ ప్రైజ్..!

ఎన్టీఆర్ బయోపిక్ సర్ ప్రైజ్..!

బాలకృష్ణ తలపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఫుల్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటుంది. క్రిష్ చేతుల్లోకి వచ్చాక సినిమా రేంజ్ మారింది. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని కాస్టింగ్ అంతా పూర్తి కాగా వారి స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారట. చంద్రబాబు నాయుడిగా రానా కనిపించనున్నారు. ఇటీఅల రానా లుక్ చూస్తే క్లీన్ షేవ్ తో స్లిం లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఇక సినిమాలో మేకప్ తో రానా అచ్చం చంద్రబాబుగా కనిపిస్తారట. బాలీవుడ్ నుండి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను పిలిపించారట. ఇక సినిమాలో బాలకృష్ణ కూడా దాదాపు 60 గెటప్పులలో కనిపిస్తారని తెలుస్తుంది. ఈమధ్యనే ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయగా రిలీజ్ వరకు సినిమా పై అంచనాలు పెరిగేలా సర్ ప్రైజ్ గా ఒక్కొక్కరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఖచ్చితంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా కోసం ఎదురుచూస్తే ఆడియెన్స్ కు.. నందమూరి ఫ్యాన్స్ కు ఈ సర్ ప్రైజ్ లు నచ్చుతాయని అంటున్నారు. శాతకర్ణి తర్వాత బాలకృష్ణ, క్రిష్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news