Gossips'అరవింద సమేత' రెండో టీజర్ కు సర్వం సిద్ధం..!

‘అరవింద సమేత’ రెండో టీజర్ కు సర్వం సిద్ధం..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవిందం సమేత వీర రాఘవ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే మొదటి టీజర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఖుషి అయినా త్రివిక్రం ఫ్యాన్స్ ను అంతగా మెప్పించలేదు. అందుకే త్రివిక్రం తన ఫ్యాన్స్ కోసం అరవింద సమేత నుండి మరో టీజర్ రిలీజ్ చేస్తున్నాడట. 7

2

3

సెప్టెంబర్ 13 వినాయక చవితి సందర్భంగా వీర రాఘవ రెండో టీజర్ రిలీజ్ చేయబోతున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బకు సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ అరవింద సమేత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
6

5

4

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news