Gossipsఖర్చు కోట్లలో వసూళ్లు లక్షల్లో.. నిహారిక రెండో సినిమా దెబ్బ పడిందా..!

ఖర్చు కోట్లలో వసూళ్లు లక్షల్లో.. నిహారిక రెండో సినిమా దెబ్బ పడిందా..!

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన సినిమా హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మణ్ కార్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా యువి క్రియేషన్స్, పాకెట్ మూవీస్ కలిసి నిర్మించాయి. భారీ స్టార్ కాస్ట్ తో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చింది. అయితే సినిమాకు అయిన కర్చుతో పోల్చుకుంటే కలక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయి.

హ్యాపీ వెడ్డింగ్ మొదటి రోజు 25 లక్షల రూపాయలు కలెక్ట్ చేయగా రెండో రోజు అది కూడా ఆదివారం అయినా సరే 20 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. మెగా ప్రమోషన్స్ చేసినా ఈ సినిమా గట్టెక్కేలా కనబడటం లేదు. రొటీన్ కథ, సాగదీసిన సన్నివేశాలు, పేజీల కొద్ది డైలాగ్స్ సినిమాకు దెబ్బ వేశాయి. మరి ఈ వసూళ్లతో సినిమా నిలబడటం కష్టమే.. ఒక మనసు తర్వాత నిహారిక చేసిన ఈ మలి ప్రయత్నం కూడా ఫెయిల్యూర్ అటెంప్ట్ గానే మిగిలేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news