Gossipsకాలా సెన్సార్ షాక్.. అలా అనుకున్న వారందికి మైండ్ బ్లాంక్...!

కాలా సెన్సార్ షాక్.. అలా అనుకున్న వారందికి మైండ్ బ్లాంక్…!

సూపర్ స్టార్ మహేష్, పా. రంజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కాలా. ఈ సినిమాను రజిని అల్లుడు ధనుష్ ఈ సినిమా నిర్మించారు. జూన్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ముంబైలో ధారావి నేపథ్యంలో జరిగే కథగా కాలా సినిమా వస్తుంది. ఈ సినిమాలో రజిని మాస్ లీడర్ గా కనిపిస్తున్నాడు.

టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయగా తప్పకుండా కబాలిలా నిరాశపరచకుండా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. ఇక సెన్సార్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ అందుకున్న ఈ సినిమా యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సెన్సార్ టాక్ చూస్తే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నారు.

రజిని మరోసారి తన విశ్వరూపం చూపించారని తెలుస్తుంది. తమిళంతో పాటుగా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉన్న రజిని ఈ సినిమాతో రికార్డులు బద్ధలు కొడతారని అంటున్నారు. ఈశ్వరి రావు, హ్యూమా ఖురేషి నటిస్తున్న ఈ సినిమాలో నానా పటేకర్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news