Moviesరజినికాంత్ " కాలా " ప్రీ-రివ్యూ

రజినికాంత్ ” కాలా ” ప్రీ-రివ్యూ

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కాలా. కబాలి తర్వాత భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో రజిని డాన్ గా కనిపిస్తున్నాడు. వండర్ బార్ ఫిలింస్ బ్యానర్ లో రజిని అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో ఈశ్వరి రావు.. హ్యూమా ఖురేషి హీరోయిన్స్ గా నటించారు. నానా పటేకర్ విలన్ గా నటించిన ఈ సినిమా రేపు అనగా జూన్ 7 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా తెలుగు వర్షన్ 30 కోట్ల బిజినెస్ చేసింది. కబాలి భారీ అంచనాలతో వచ్చి ఇక్కడ ఫ్లాప్ అయ్యింది అందుకే ఈ కాలా ఎక్కువ బిజినెస్ చేసే అవకాశం కుదరలేదు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో ముంబైలోని ధారావి ప్రాంతంలోని ప్రజల జీవితాలకు ఓ నాయకుడి ఎలా మేలు చేశాడన్న కథతో వస్తుంది.

కరికాలన్ గా రజిని కనిపిస్తున్నాడు. సినిమాలో రజిని యాక్షన్, స్టైల్ అదిరిపోతాయని తెలుస్తుంది. ఇక తన మార్క్ డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయట. నానా పటేకర్ విలనిజం కూడా బాగుంటుందని తెలుస్తుంది. హ్యూమా ఖురేషి గ్లామర్ గా కనిపిస్తుండగా.. ఈశ్వరి రావు తన మార్క్ ఫ్యామిలీ రోల్ లో అలరించారట.

సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అవనుంది. కబాలి తర్వాత కాలా సినిమాతో వస్తున్న రజిని మరి ఈ సినిమాతో ఊహించిన రేంజ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. తెలుగులో బిజినెస్ ఎలా ఉన్నా కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా హంగామా మాములుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news