Gossipsపాపం అల్లు అర్జున్..ఇంత దారుణమైన పరిస్థితా..!

పాపం అల్లు అర్జున్..ఇంత దారుణమైన పరిస్థితా..!

మెగా హీరోల్లో మొన్నటిదాకా టాప్ రేంజ్ హిట్లు అందుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ ఒక్క ఫ్లాప్ తో చాలా వెనక్కి వెళ్లాడని చెప్పొచ్చు. నా పేరు సూర్య సినిమా బన్నికి ఫ్లాప్ మాత్రమే కాదు చాలా నష్టాన్నే మిగిల్చింది. ఓ పక్కా మొన్నటిదాకా ఫాం లో లేని మెగా వారసుడు రాం చరణ్ ఇండస్ట్రీ హిట్టు కొట్టగా మెగా హీరోల్లో చిరు, పవన్ తర్వాత తానే అన్న క్రేజ్ తెచ్చుకున్న బన్ని ఇప్పుడు చరణ్ కన్నా చాలా వెనుకపడ్డాడు.

నా పేరు సూర్య రిజల్ట్ ఎలా ఉన్నా మరో సినిమా ఏది మొదలుపెట్టలేదు. స్టార్ డైరక్టర్స్ అంతా వారి వారి సినిమాలతో బిజీగా ఉండటంతో ఇప్పుడు బన్ని చేసేందుకు దర్శకుడు లేకుండా పోయాడు. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేయలేని పరిస్థితి మోస్తారు దర్శకులను నమ్మేలా లేదు. స్టార్ తో సినిమా అంటే కచ్చితంగా ఓ ఆరు నెలలు ఆగక తప్పదని తెలుస్తుంది.

అందుకే విక్రం కుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట బన్ని. మనం, 24 సినిమాలు హిట్ అయినా అఖిల్ హలో సినిమా మాత్రం నిరాశ పరచింది. మరి బన్నిని విక్రం ఏం చేస్తాడో చూడాలి. ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే మరో సినిమా లైన్ లో పెట్టుకుంటారు ఈ విషయం లో వెనుకపడ్డ బన్ని ఇప్పుడు స్టార్ డైరక్టర్స్ ఎవరు లేకుండా సినిమా చేయాల్సి వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news