Moviesవిశాల్ అభిమన్యుడు పబ్లిక్ టాక్..!

విశాల్ అభిమన్యుడు పబ్లిక్ టాక్..!

తెలుగువాడే అయినా తమిళంలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విశాల్ తన ప్రతి సినిమా తెలుగు తమిళ రెండు భాషల్లో రిలీజ్ చేస్తారు. రీసెంట్ గా తమిళంలో రిలీజ్ అయిన ఇరుంబు తిరై సినిమా తెలుగులో అభిమన్యుడుగా రిలీజ్ చేశారు. విశాల్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సైబర్ క్రైం నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా పబ్లిక్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది. నిత్య జీవితం లో జరుగుతున్న సైబర్ మోసాల గురించి చాలా క్లియర్ గా చూపించారని పబ్లిక్ చెబుతున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాగా అభిమన్యుడు సినిమాను పొగుడుతున్నారు ప్రేక్షకులు. పాజిటివ్ రివ్యూస్ తో పాటుగా పాజిటివ్ పబ్లిక్ టాక్ సినిమాకు ఎంతో క్రేజ్ తెస్తుంది.

ఇక మొదటి రోజు కలక్షన్స్ ఎలా ఉన్నా సినిమాకు వచ్చిన ఈ సూపర్ టాక్ తో వీకెండ్ లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. మిత్రన్ డైరక్షన్ లో వచ్చిన విశాల్ అభిమన్యుడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news