Gossipsకన్నతల్లిని ఇంత దారుణంగా హింసించిందా..!

కన్నతల్లిని ఇంత దారుణంగా హింసించిందా..!

సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అవగా.. ఆ సినిమా విషయంలో ప్రతిది దగ్గర ఉండి చూసుకున్నారు సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి. సినిమా అమ్మకు గొప్ప నివాళి అంటూ ఆడియో, ప్రీ రిలీజ్ ఈఎవెంట్ ఇలా అన్ని చోట్ల ఆమె తన తల్లిని తలుచుకుంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

అయితే సావిత్రి చివరి రోజుల్లో ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వారిలో సొంత కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఉందని కొందరు అంటున్నారు. ఈమధ్యనే ఓ ఆడియో ఫైల్ బయటకు వచ్చింది. సావిత్రి చివరి రోజుల్లో ఆమెని ఇంటి నుండి బయటకు గెంటేసి సొంత ఇళ్లు ఆక్రమించింది విజయ చాముండేశ్వరి అలాంటి ఆమె తన తల్లి గురించి గొప్పగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమెకు తెలిసిన వారు అంటున్నారు.

అంతేకాదు సావిత్రితో పాటు తమ్ముడు సతీష్ ను కూడా రెంట్ హౌజ్ లో ఉండేలా చేసింది విజయనే అని అంటున్నారు. కష్టాల్లో ఆమెని వదిలేసి తన తల్లిని జాగ్రత్తగా కాపాడుకున్నట్టు మీడియా ముందు మాట్లాడుతుంది కాని అసలు నిజం ఇదని ఆమె గురించి పూర్తిగా తెలిసిన ఓ సన్నిహితురాలు ఈ ఆడియో ఫైల్ ను రిలీజ్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news