Gossipsఅరవింద సమేత రికార్డులు మొదలయ్యాయి..!

అరవింద సమేత రికార్డులు మొదలయ్యాయి..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ సినిమా మీద బీభత్సరమైన అంచనాలు ఏర్పడేలా చేసింది. సిక్స్ ప్యాక్ బాడీతో తారక్ అయితే రికార్డులు చెడుగుడు ఆడేందుకు రెడీ అన్నట్టు కనిపించాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసే సినిమా పక్కా హిట్ అనుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక బిజినెస్ విషయానికొస్తే ఆల్రెడీ ఓవర్సీస్ లో ఎన్.టి.ఆర్ స్టామినా చూపించేలా ఈ సినిమా హక్కులు అమ్మేశారు. ఇప్పుడు సీడెడ్ లో కూడా దుమ్మురేపే బిజినెస్ తో అరవింద సమేత కొత్త రికార్డులు సృష్టిస్తుంది. రాయలసీమ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాను సీడెడ్ రైట్స్ 14 కోట్లకు కొనేశారట.

జిఎస్టి లేకుండా అయితే అది 12 కోట్లే నిర్మాతకు వస్తుంది. కాని జిఎస్టితో కలుపుకుని 14 కోట్లకు అరవింద సమేతను కొన్నారట. ఈ లెక్క చాలు సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అని చెప్పడానికి. టెంపర్ నుండి వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేతతో కొత్త సంచలనాలు సృష్టిస్తాడని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news