Gossipsఅర్జున్ రెడ్డి రీమేక్‌.. స్టార్ హీరో కుమారుడి తెరంగేట్రం!

అర్జున్ రెడ్డి రీమేక్‌.. స్టార్ హీరో కుమారుడి తెరంగేట్రం!

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా ఓ ప్రభంజనం. యాంటీ పబ్లిసిటీని కూడా అనుకూలంగా మార్చుకుని దుమ్ము రేపింది. రొటీన్ సినిమాలకు భిన్నమైన లవ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. హిందీ మరియు తమిళ్ పరిశ్రమలు సైతం  టాలీవుడ్ వైపు ఓ లుక్కేసేలా చేసింది  ఈ చిత్రం . ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడేలా చేసింది.బాలీవుడ్ అతి పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యాష్ చోప్రా ఫిలిమ్స్ అర్జున్ రెడ్డి చిత్రాన్ని రణ్వీర్ సింగ్ తో రీమేక్ చెయ్యడానికి  ప్లాన్ చేస్తుంది .

తమిళ్ లో  కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలనే ఆలోచనలో వున్నారు .   ఓ యంగ్ హీరో ఈ సినిమా ద్వారానే తెరంగేట్రం చేయనున్నాడు. తమిళ రీమేక్‌లో స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించనున్నాడు. నటనకు స్కోప్ ఉన్న మూవీతో సినీ రంగంలోకి తన కుమారుడితో అడుగు పెట్టించాలని విక్రమ్ భావించారు. అర్జున్ రెడ్డి మూవీ బాగా కలిసొస్తుందని భావించిన విక్రమ్.. ధ్రువ్‌ను ఈ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేయించనున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తీసుకొచ్చిన ఈ మూవీ ధ్రువ్‌కు ఎలాంటి ఇమేజ్ కట్టబెడుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news