Moviesప్రభాస్ తో సాహో ఛాన్స్ ఆ అమ్మడికే దక్కిందా..!

ప్రభాస్ తో సాహో ఛాన్స్ ఆ అమ్మడికే దక్కిందా..!

సాహూతో ఆ అమ్మడుకి దక్కిన అదృష్టం … యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. బాహుబలి రిలీజ్ టైంలోనే సాహో 30 సెకన్ల టీజర్ రాగా ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఈమధ్యనే సాహోలో ప్రభాస్ న్యూ లుక్ బయటకు రాగా ఫ్యాన్స్ వాటిని చూసి ఖుషి చేసుకుంటున్నారు. ఇక ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా సరే ఇప్పటిదాకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఫైనల్ అవ్వలేదు. బాలీవుడ్ భామలు పరిణీతి చోప్రా, అలియా భట్ లాంటి హీరోయిన్స్ పేర్లు వినిపించినా సరే వారెవరు చేయట్లేదని తెలుస్తుంది.

ఇక రీసెంట్ గా మరోసారి బాహుబలి పెయిర్ అయితేనే బాగుంటుందని అనుష్కతో ప్రభాస్ రొమాన్స్ చేస్తాడని అన్నారు. కాని సినిమాకు కావాల్సిన హీరోయిన్ బబ్లీగా ఉండాలని.. కాస్త కూస్తో సైజ్ తగ్గినా అనుష్క ఇంకా తగ్గాలని చెప్పారట. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదు కాబట్టి అమ్మడు ఆ ఛాన్స్ వదులుకుంది. ఇక ఫిల్మ్ నగర్ లో మాత్రం ప్రభాస్ పక్కన సాహోలో శ్రద్ధ కపూర్ ఫైనల్ అయ్యిందని అంటున్నారు. కేవలం తెలుగులోనే కాదు సాహో తెలుగు తమిళ హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే హింది మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని అక్కడ హాట్ భామనే సెలెక్ట్ చేశారట. మరి సాహోలో శ్రద్ధ కపూర్ అయినా కన్ఫామా కాదా అన్నది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news