Moviesఆ లాప్ టాప్ లో దొరికిన హీరొయిన్ ఈమేనా...?

ఆ లాప్ టాప్ లో దొరికిన హీరొయిన్ ఈమేనా…?

యువ హీరో నితిన్ హను రాఘవపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లై. 14 రీల్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక చాలా విచిత్రంగా జరిగిందట. సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ మేఘా ఆకాష్. ఇప్పటికే తమిళంలో క్రేజీ హీరోయిన్ అయిన ఈ భామ తెలుగులో మొదటిసారి నితిన్ పక్కన నటించింది.

సినిమా కథా చర్చల్లో ఉండగానే ఒకసారి తమిళ దర్శకుడు గౌతం మీనన్ లాప్ ట్యాప్ లో మేఘా ఆకాష్ ఫోటోలను చూశారట నితిన్ ఆ వెంటనే దర్శకుడు హనుకి ఆ పిక్స్ చూపించడంతో వెంటనే ఆమెను స్క్రీన్ టెస్ట్ కు పిలిచారట. తాము అనుకున్న కథకు సరిపోతుందని మేఘా ఆకాష్ ను సెలెక్ట్ చేశారట దర్శక నిర్మాతలు. సో అలా లాప్ ట్యాప్ లో హీరోయిన్ ఫోటో చూసి ఆమెను సెలెక్ట్ చేయడం జరిగిందట.

ఈ విషయం ఆ సినిమా హీరో నితిన్ చెప్పడం విశేషం. తమిళ మలయాళ భామలకు తెలుగులో క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. కాస్త టాలెంట్ ఉంటే చాలు ఇక్కడే స్థిరపడేలా చేస్తారు తెలుగు ప్రేక్షకులు. టీజర్ ట్రైలర్స్ లో మేఘా ఆకాష్ ఇంప్రెసివ్ గానే ఉంది. మరి అమ్మడి టాలెంట్ ఏంటి అన్నది ఈ శుక్రవారంతో తేలిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news