Newsసిట్ విచారణకు హజరయిన నటుడు తరుణ్

సిట్ విచారణకు హజరయిన నటుడు తరుణ్

తనకు పబ్ ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సినీనటుడు తరుణ్ అన్నారు. సిట్ విచారణకు తన తండ్రితో కలిసి బయలుదేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు ఏడేళ్ల కిందట ఒక పబ్ లో భాగస్వామ్యం ఉన్న మాట వాస్తవమేననీ, అయితే ఆరేళ్ల కిందటే ఆ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నానని తరుణ్ వెల్లడించారు. తన నిజాయతీ ఏంటో సిట్ ముందు నిరూపించుకుంటానని చెప్పారు.

సిట్ విచారణ అనంతరం అన్ని విషయాలను చెబుతానని… అంతవరకు సంయమనం పాటించాలని అన్నారు.లవర్ బోయ్ గా మంచి ఇమేజ్ సంపాదించిన తరుణ్ చాలా కాలం తర్వాత ఇది నా లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. రమేష్ గోపి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తరుణ్ సరసన ఒవియా హెలెన్ కథానాయికగా నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news