Gossipsవెంకటేష్ అల్లుడు అవుతున్న అఖిల్..? అసలు వాస్తవమిదే..!

వెంకటేష్ అల్లుడు అవుతున్న అఖిల్..? అసలు వాస్తవమిదే..!

దగ్గుబాటి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న సంబంధం అందరికి తెలిసిందే. వెంకటేష్ సోదరినే అక్కినేని నాగార్జున మొదట పెళ్లాడాడు అయితే వ్యక్తిగత కారణాల వల్ల వారు విడిపోయారు. కొద్దిరోజులు ఈ రెండు ఫ్యామిలీల మధ్య మాటలు లేకున్నా ఆ తర్వాత మళ్లీ అంతా సెట్ రైట్ అయ్యింది. ప్రస్తుతం నాగార్జున, దగ్గుబాటి లక్ష్మిల తనయుడు నాగ చైతన్య టాలీవుడ్ లో హీరోగా అటు అక్కినేని ఇటు దగ్గుబాటి అభిమానుల సపోర్ట్ తో సినిమాలు చేస్తున్నాడు.

ఇక త్వరలో సమంతను కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు చైతు. ఇక నాగ్ చిన్న కొడుకు అఖిల్ కూడా జివికె రెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్ ను పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్ధం కూడా జరిగిన సంగతి తెలిసిందే. మధ్యలో ఏవో గొడవల వల్ల అఖిల్ శ్రీయాల పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక మరోసారి అఖిల్ పెళ్లి గురించి కొత్త న్యూస్ వస్తుంది.

వెంకటేష్ కూతురితో అఖిల్ మ్యారేజ్ అంటూ ఫిల్మ్ నగర్ లో కొత్త రూమర్ స్టార్ట్ అయ్యింది. అఖిల్ కన్నా వెంకటేష్ మొదటి కూతురు పెద్దదే అయినా సరే అఖిల్ కు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారట. ఈ విషయంలో నాగార్జున, వెంకటేష్ లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. మరి గాలి వార్తలా వచ్చిన ఈ న్యూస్ నిజమవుతుందా లేక గాసిప్పుగా మిగులుతుందా అన్నది చూడాలి. అసలైతే శ్రీయాతో మ్యారేజ్ క్యాన్సిల్ అయిన అఖిల్ తన కెరియర్ మీద ఫోకస్ పెట్టాడని అన్నారు. మరి ఇంతలోనే పెళ్లి మ్యాటర్ రావడం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇందులో ఎంత నిజం ఉంది అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news