Moviesప్రీ-లుక్ పోస్టర్ టాక్ : సరికొత్తగా దర్శనమిచ్చిన చరణ్.. సుక్కు మార్క్...

ప్రీ-లుక్ పోస్టర్ టాక్ : సరికొత్తగా దర్శనమిచ్చిన చరణ్.. సుక్కు మార్క్ అదుర్స్

Finally, Ram Charan and Sukumar combo movie has launched officially. On this occasion the unit released the pre look poster which impressed with every one.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న తాజా చిత్రం ఈరోజు ఉదయం (30-01-2017) లాంఛనంగా ప్రారంభం అయ్యింది. నిజానికి.. ఈ మూవీ గతేడాదిలోనే ప్రారంభం కావాల్సింది కానీ, చెర్రీ తన ‘ధృవ’తోపాటు తండ్రి చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత కూడా అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడంటూ పోస్ట్‌పోన్ అవుతూ.. ఎట్టకేలకు ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ ఈవెంట్‌కి చిరు ముఖ్య అతిథిగా విచ్చేయగా.. ఇతర సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ముందునుంచి ఈ సినిమాని పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్లు రివీల్ చేయడానికే ఈ పోస్టర్‌ని రిలీజ్ చేసినట్లు తెలిసింది. చరణ్ పంచెకట్టులో, రెండు బిందెలను కావడిలో మోస్తూ, పల్లెటూరు దిశగా వెళుతున్నట్లు స్కెచ్ రూపంలో ఈ ఫోటోని డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో సుక్కు మార్క్ అదుర్స్ అనిపించక మానదు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. చరణ్‌లాంటి మెగాపవర్‌స్టార్ చాలా సింపుల్ రోల్‌లో కనిపించడమే. గతంలో ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం కూడా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందినా.. చరణ్ లండన్ నుంచి పోష్ క్యారెక్టర్‌లో కనిపించాడు. కానీ.. సుకుమార్ మూవీలో మాత్రం పూర్తిగా పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ ప్రీ-లుక్ పోస్టర్‌లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తన స్టార్ స్టేటస్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా చరణ్ ఈ పాత్ర చేస్తున్నందుకు, అలాగే సుకుమార్ అతనితో అలాంటి పాత్ర చేయిస్తున్నందుకు.. ఇద్దరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సాధారణంగానే సుకుమార్ సినిమాల్లో ఏదో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడిది పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండడంతో.. దీనిపై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news