కొల‌వ‌రీ ఢీ అంటున్న ప‌వ‌న్

pawan kalyan

సంక్రాంతిబ‌రిలో దిగ‌నున్న ప‌వన్ కొత్త పాట అందుకున్నాడు

ఆ పాట‌ని అనిరుధ్ కంపోజ్ చేశాడు

అద‌ర‌గొట్టేశాడు..

వివ‌రాలిలా :: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు.అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈనెల 7న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేయనున్నారు.పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్‌ పోస్టర్‌తో పాటు, మ్యూజికల్‌ సర్‌ప్రైజ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇందులో ‘బయటకొచ్చి చూస్తే’ అంటూ సాగే పాటను అనిరుధ్‌ పాడుతూ కనిపించారు. అయితే ఇప్పుడు ఆ పూర్తి పాటను నవంబర్‌ 7న విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. మరి నవంబర్‌ 7న సినిమా టైటిల్‌ను ఖరారు చేయ‌నున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ షూటింగ్ విదేశాల్లో జ‌రుగుతోంది. ఈ సినిమా పూర్తిచేయ‌గానే ప‌వ‌న్ పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టిసారించ‌నున్నాడు.జ‌న‌సేన కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నున్నాడు.

 

More from my site