కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే భారత్‌లో 30 లక్షల కేసులు, 53 వేల మరణాలు నమోదు అయ్యాయి. ఇక కరోనా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, సినిమా వాళ్లు, రాజకీయ నాయకులను కూడా చంపేస్తోంది. ఇక రాజకీయ నాయకులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళుతున్నారు. దీంతో వారికి సులువుగా కోవిడ్ ఎటాక్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కరోనా భారీన పడ్డారు.
కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కరోనాకు బలి కూడా అయ్యారు. ఇక రోజు రోజుకు కేసుల తీవ్రత మరింత ఎక్కువ అవుతోంది. ఈ లిస్టులోకే ఇప్పుడు మరో మాజీ మంత్రి చేరారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తనకు కరోనా సోకిన విషయాన్ని రఘునాథ్ రెడ్డే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే తాను మీ ముందుకు వస్తానని కూడా చెపుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఇక పల్లెకు కరోనా రావడంతో స్థానిక టీడీపీ నాయకుల్లో ఒక్కటే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఆయన్ను గత పది రోజలుగా ఎంతో మంది నాయకులు కలిశారు. దీంతో ఇప్పుడు వారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పల్లె సూచించారు. ఇక పల్లెకు కరోనా రావడంతో ఆయన కరోనా నుంచి కోలుకుని క్షేమంగా బయటపడాలని టీడీపీ నాయకులు కోరుకుంటున్నారు.