Gossipsటాలీవుడ్లో కొత్త రోల్లో ఎంట్రీ ఇస్తోన్న‌ నాని, మిహీకా బ‌జాజ్‌..!

టాలీవుడ్లో కొత్త రోల్లో ఎంట్రీ ఇస్తోన్న‌ నాని, మిహీకా బ‌జాజ్‌..!

టాలీవుడ్‌లో మారుతోన్న ప‌రిస్థితులు, క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది వెబ్‌సీరిస్‌ల‌లో న‌టించేందుకు, వెబ్‌సీరిస్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి నేచుర‌ల్ స్టార్ నాని కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. త‌న వీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న సంద‌ర్భంగా రానా మాట్లాడుతూ తన సొంత బ్యానర్ పై వెబ్ సిరీస్ నిర్మిస్తానంటున్నాడు. నాని ఇప్ప‌టికే నిర్మాత‌గా అ, హిట్ సినిమాలు తీశాడు. ఇప్పుడు మూడో ప్ర‌య‌త్నంలోనే త‌న బ్యాన‌ర్‌పై వెబ్ సీరిస్ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇందులో నాని న‌టిస్తాడా ? లేదా ? అన్న‌ది చూడాలి.

Who is Rana Daggubati's fiancee Miheeka Bajaj?

ఇక అప్‌క‌మింగ్ మూవీ ట‌క్ జ‌గ‌దీష్ అక్టోబ‌ర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లి 2021 ప్ర‌థ‌మార్థంలో థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంద‌ని క్లారిటీ ఇచ్చాడు. ఇక నానితో పాటు రానా భార్య మిహీకా బ‌జాజ్ సైతం వెబ్‌సీరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. వాస్త‌వానికి ఆమెకు ముందు నుంచి నిర్మాణ రంగంలోకి… అందులోనూ వెబ్‌సీరిస్‌లోకి రావాల‌న్న కోరిక ఎక్కువ‌ట‌. ఇప్పుడు ఆమె ఎలాగూ ఓ బ‌డా నిర్మాతకు కోడ‌లు అయ్యింది.

Nani completes 11 years in Tollywood; here's how he made it big in ...

ఇక త‌న డిజైనింగ్ బిజినెస్‌తో పాటు ఇప్పుడు వెబ్‌సీరిస్ నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంద‌ట‌. రానా కూడా ఇందుకు ఓకే చెప్పేశాడ‌ని.. అయితే మిహీకా ఏ క‌థ‌ల‌తో వెబ్‌సీరిస్ నిర్మిస్తుందో ? అన్న‌ది క్లారిటీ లేదు. ఏదేమైనా టాలీవుడ్‌లో ప‌లువురు ఔత్సాహికులు ఇప్పుడు వెబ్‌సీరిస్ బాట పట్టేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news