Moviesరష్మిక ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణం ఆ హీరోయిన్ పెట్టిన...

రష్మిక ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణం ఆ హీరోయిన్ పెట్టిన భిక్షేనా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!

రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . అంతేకాదు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మారు మ్రోగిపోతున్న స్టార్ హీరోయిన్ పేరు కూడా ఇదే కావడం గమనార్హం. యానిమల్ సినిమాలో రష్మిక బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి జనాలు ఫిదా అయిపోయారు. ఆఫ్ కోర్స్ కొంతమంది బూతులు కూడా తిట్టారు. తిట్టినా ట్రోల్ చేసిన ఐ డోంట్ కేర్ అంటూ ముందుకు దూసుకెళ్లిపోతుంది రష్మిక మందన్నా.

ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది . రష్మిక మందన్నా..సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన సినిమా కిర్రాక్ పార్టీ . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . రష్మిక పేరు మారుమ్రోగి పోయేలా చేసింది . ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేలా చేసింది. అయితే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ సాయి పల్లవి అని అనుకున్నారట .

కానీ ఆమె కొన్ని కారణాల చేత ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. దీంతో రష్మిక ఛాన్స్ దక్కించుకుంది. ఒకవేళ ఆ ఆఫర్ ని సాయి పల్లవి ఓకే చేసుంటే రష్మిక వరకు వచ్చి ఉండేదే కాదు. అసలు రష్మిక సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఉండేదే కాదు.. తెలిసి చేసిందో తెలియక చేసిందో రష్మిక కెరియర్ బాగుపడడానికి వన్ ఆఫ్ ద టాప్ రీజన్ గా మారిపోయింది సాయి పల్లవి . ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news