Movies"ప్రెగ్నెన్సీ పై అలాంటి పోస్ట్" .. షాక్ లో సింగర్స్ సునీత...

“ప్రెగ్నెన్సీ పై అలాంటి పోస్ట్” .. షాక్ లో సింగర్స్ సునీత ఫ్యాన్స్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం.. ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం కోసం పెద్ద కష్టం అయిపోయింది. ఎక్కువగా ఫేక్ వార్తలు ఉండటం గమనార్హం. మరీ ముఖ్యంగా డబ్బున్న స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన వారి వార్తలు .. అలాగే సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. చాలావరకు ఫేక్ వార్తలు మనం వింటూ వస్తున్నాము. అయితే అలా వైరల్ అయ్యే వార్త ప్రతిదీ ఫేక్ అని కొట్టి పడేయాలేము.

కొన్నిసార్లు అవి నిజంగా కూడా జరిగాయి . తాజాగా సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సింగర్ సునీతకి సంబంధించిన ఒక ఫేక్ వార్త బాగా వైరల్ అయింది . సింగర్ సునీత మనకు తెలిసిందే ..అద్భుతమైన గొంతు అంతకుమించిన అందమైన రూపం ..చక్కటి మనసు హీరోయిన్స్ కి మించిపోయేలా ఉంటుంది .మానవత్వం కలిగిన మనిషి .. సునీత గురించి ఎంత చెప్పకున్నా తక్కువే.. కెరియర్ లో ఎన్నో కష్టాలు పడింది.. మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు కన్న సునీత ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .

ఆ తర్వాత ఆమె మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని పెళ్లి చేసుకుంది. లైఫ్ లో చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తుంది . కాగా సునీత ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరుగుతుంది . గతంలో ఇలా ఎన్నోసార్లు జరిగింది .ఆమె క్లారిటీ ఇచ్చింది . అయినా మరోసారి కూడా అలాంటి వార్తలు అయ్యాయి. 45 ఏళ్ల వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది.

ఈ వార్తలు జోరుగా ఊపొందుకోవడంతో సింగర్ సునీత స్పందించింది . “ఇప్పటికే ప్రెగ్నెన్సీ అంటూ నాపై ఎన్నోసార్లు వార్తలు రాశారు ..నేను స్పందించాను.. ఎందుకు మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు.. ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే మేమే చెప్తాం. ఎందుకు దాచిపెడతాం? సంతోషంగా అందరితో పంచుకుంటా.. ఇక మీ టైం వేస్ట్ చేసుకోవద్దు” అంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది . దీంతో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు . నిజంగానే సునీత ప్రెగ్నెంట్ అంటూ ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు ఆ విషయం కాదు అని తెలియడంతో కొంతమంది డీలా పడిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news