Moviesవామ్మో .. డైరెక్టర్లకు అలాంటి కండిషన్స్ పెడుతున్న సమంత..భలే మెలిక పెడుతుందే..?!

వామ్మో .. డైరెక్టర్లకు అలాంటి కండిషన్స్ పెడుతున్న సమంత..భలే మెలిక పెడుతుందే..?!

సమంత ..సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాలో మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కెరియర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో దున్నేసిన సమంత ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురై ఇండస్ట్రీకి దూరమైంది . ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ దగ్గర కాబోతుంది . సినిమాలు కూడా నిర్మించాలి అంటూ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది .

ఇలాంటి క్రమంలోనే సమంత వద్దకు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట . కానీ హీరోయిన్ సమంత కొత్త కండిషన్లతో డైరెక్టర్లకు చుక్కలు చూపిస్తుందట. ఒకప్పుడు హీరోయిన్ సమంత టాప్ హీరోయిన్ కానీ ఇప్పుడు ఆమెను మించిపోయే రేంజ్ లో కూడా చాలామంది ఫిగర్లు ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నారు . అయితే సమంత ఇప్పటికీ తాను నటించే సినిమాలలో ఆమె ఫస్ట్ హీరోయిన్ గా ఉండాలి అంటూ కండిషన్ పెడుతుందట.

కొందరు డైరెక్టర్స్ దీనికి ఓకే చెప్పొచ్చు మరి కొంతమంది మాత్రం ఒకే చెప్పకపోవచ్చు . అయితే సమంత పెట్టిన కండిషన్స్ ఎవరైతే ఓకే చేస్తున్నారో అలాంటి డైరెక్టర్ సినిమాలకి ఆమె సైన్ చేస్తుందట .ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సమంత తీసుకున్న నిర్ణయం పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి . కొందరు మంచి నిర్ణయం అంటూ ఉంటే మరికొందరు తెలివితేటలతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటున్నారు . మరికొందరు ఇంకా అమ్మడు టాప్ హీరోయిన్ అన్న ఫీలింగ్ లోనే ఉంది అంటూ భ్రమ పడుతుంది అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news