Moviesఆ విషయంలో కొట్టుకుని చస్తున్న శ్రీలీల-రష్మిక ఫ్యాన్స్.. ఇదెక్కడి కొత్త తలనొప్పి...

ఆ విషయంలో కొట్టుకుని చస్తున్న శ్రీలీల-రష్మిక ఫ్యాన్స్.. ఇదెక్కడి కొత్త తలనొప్పి రా బాబు..!!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అసలు ఊహించలేరు . జనరల్ గా స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండడం సర్వసాధారణం . అయితే ఇక్కడ రూటు మారింది . ఇప్పుడు ఇద్దరు టాప్ హీరోయిన్ల ఫ్యాన్స్ మధ్య ఒక వార్ జరుగుతుంది . దానికి కారణం వాళ్లకు ఉన్న పబ్లిసిటీ క్రేజ్ అంటూ తెలుస్తుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల.. హీరోయిన్ రష్మిక మందన్నా.. కనడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే …

అంటే ఒకే ఇంటి నుంచి వచ్చిన వారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా ఎప్పుడు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకున్నట్లు కాని.. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నట్లు కానీ బయటకు రాలేదు . అంతేకాదు ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ కూడా నడుస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి కారణం రష్మిక మందన్నాను ఆమె ఫాలో కాకపోవడమే . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నాను టాప్ మోస్ట్ సెలబ్రిటీలు కూడా ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు .

అయితే సొంత గూటి నుంచి వచ్చిన శ్రీ లీల మాత్రం రష్మికను అస్సలు పట్టించుకోవడం లేదు . రష్మికను ఫాలో అవ్వడం లేదు. దీంతో వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా ..??? అంటూ చర్చించుకుంటున్నారు . ఇంస్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యే శ్రీ లీల ఎందుకు రష్మికను మాత్రమే ఫాలో కావడం లేదు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది . ఇద్దరు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే కదా .. ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉండదా ..?? అంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఇది చాలా సింపుల్ విషయమని దీనికి ఇంత రాద్ధాంతం అవసరం లేదు అని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news