Movies"దేవర" కొత్త పోస్టర్ తో సినిమా మెయిన్ పాయింట్ లీక్ చేసిన...

“దేవర” కొత్త పోస్టర్ తో సినిమా మెయిన్ పాయింట్ లీక్ చేసిన కొరటాల.. మీరు గమనించారా..?

దేవర .. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ పేరు . ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సింది .కానీ కొన్ని అనివార్య కారణాల చేత దేవర సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు . మొదటగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలి అనుకున్నారు . కానీ అదే మూమెంట్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఉండడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తూ మరోసారి అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ చేయాలి అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు చిత్ర బృందం.

దీనిపై ఎన్టీఆర్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. అయితే ఈ డేట్ ను అనౌన్స్ చేస్తూ కొత్త దేవర పోస్టర్ ని రిలీజ్ చేశారు . ఆ పోస్టర్ ఇప్పుడు సినిమా కథను లీక్ చేసేలా ఉంది అంటున్నారు జనాలు . దేవరా టైటిల్ లోనే అసలు కథ కనిపిస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు . ప్రారంభంలో దేవర టైటిల్ ప్లెయిన్ గా ఉంది. కానీ నిన్న కొత్తగా రిలీజ్ చేసిన డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో ఓ రహస్యాన్ని బయటపెట్టాడు కొరటాల శివ.

టైటిల్ లో దేవర ల్లో “వర” రెడ్ కలర్ తో ఉంది. అంతేకాదు ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ కొత్త లుక్ కూడా చాలా వెరైటీగా ఉంది . యంగ్ గా కనిపిస్తున్నాడు . అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని అర్థం . ప్రారంభంలో వచ్చిన ఎన్టీఆర్ లుక్ తండ్రి పాత్రకు సంబంధించినది అని .. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన లుక్ కొడుకు పాత్రకు సంబంధించినది అని ప్రచారం చేస్తున్నారు. తండ్రి దేవరగా కనిపిస్తే కొడుకు “వరా” పాత్రలో కనిపిస్తాడు అని రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్ ఆధారంగా తెలుస్తుంది . సముద్రపు పోర్టు బ్యాక్ డ్రాప్ లో ఈ కథ కొనసాగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news