Movies"పెద్ద తప్పు చేశాను..ప్లీజ్..నన్ను క్షమించు అన్నయ్య"..చిరంజీవి పై చిన్ని కృష్ణ సంచలన...

“పెద్ద తప్పు చేశాను..ప్లీజ్..నన్ను క్షమించు అన్నయ్య”..చిరంజీవి పై చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ స్టార్ హీరోగా తన హవా కొనసాగిస్తున్నారు.. అందరి దగ్గర శభాష్ అనిపించుకుంటున్నాడు అంటే ఆయనలోని మంచితనమే కారణమని చెప్పాలి. అయితే ఇన్నాళ్ళ చిరంజీవి కెరియర్ లో చాలామంది ఆయనను తిట్టారు . ఆయన మంచితనాన్ని అలుసుగా భావించి ఆయనపై నిందలు కూడా వేశారు.

అయితే ఏనాడూ కూడా చిరంజీవి వాళ్లపై వేలెత్తి చూపించలేదు . ఆయనను తిట్టిన వారిని కూడా సహాయం చేసేటటువంటి మంచి గుణం చిరంజీవికి ఉంది . తాజాగా ప్రముఖ రచయిత చిన్న కృష్ణ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మనకు తెలిసిందే గతంలో చిన్ని కృష్ణ చిరంజీవిపై ఘాటుగా మాట్లాడారు . ఆయనపై నిందలు వేశారు . చిరంజీవికి ఇంద్ర చిత్రానికి కథ అందించింది ఆయనే. అంత పెద్ద హిట్ చిత్రానికి కథ అందించినప్పటికీ చిరంజీవి తనకు గౌరవం ఇవ్వలేదని ..ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదని రకరకాల మాటలతో ఆయనపై ఆరోపణలు చేశారు .

అయితే ఎప్పుడూ కూడా చిరంజీవి చిన్ని కృష్ణని వేలెత్తి చూపలేదు ..నిందించలేదు . తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో చిన్నికృష్ణ ఆయనను సత్కరించడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఏ విషయం మనసులో పెట్టుకోకుండా చిరంజీవి ఆయనను ఇన్వైట్ చేసిన పద్ధతి చాలా చాలా మనసుకు హత్తుకున్నట్లు చిన్ని కృష్ణ తెలిపారు . “అందరూ తప్పులు చేస్తారు.. తప్పుగా మాట్లాడుతారు ..నేను బ్యాడ్ టైం నడుస్తున్న సమయంలో మిమ్మల్ని తిట్టాను ..నిజానికి నేను మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలు కావు .. అవి నాపై కొందరు బలవంతంగా ఒత్తిడి తెచ్చి మిమ్మల్ని అలా తిట్టించారు ..దయచేసి నన్ను క్షమించండి ” అంటూ చిన్ని కృష్ణ చిరంజీవి గారిని కోరారు . ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news