Moviesబాలయ్య కు బ్రదర్ గా స్టార్ యంగ్ హీరో.. బాబి బాగానే...

బాలయ్య కు బ్రదర్ గా స్టార్ యంగ్ హీరో.. బాబి బాగానే ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేస్తున్నాడుగా..!

కోట్లాదిమంది సినీ లవర్స్ వెయిట్ చేస్తున్న సినిమా బాలయ్య బాబీ కాంబినేషన్లో రాబోతున్న మూవీనే. అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా ప్రెసెంట్ సెట్స్ పై ఉంది. ఈ సినిమా లో హీరోయిన్గా తమన్నా ని చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో బాలయ్యకు బ్రదర్ గా యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దుల్కర్ సల్మాన్ ఎంత టాలెంటెడ్ గల హీరోనో మనకు తెలిసిందే . అలాంటి హీరో బాలయ్యతో సినిమాలో నటిస్తే ఆయన క్రేజ్ పెరగడమే కాకుండా ..మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి . ఈ సినిమాకి దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ మంచి ప్రశంసలు దక్కుతాయి అంటున్నారు మేకర్స్ .

అంతేకాదు బాలయ్య దుల్కర్ సల్మాన్ ల మధ్య వచ్చే డైలాగులు మంచి చీజీ చీజీగా రాసుకున్నాడట బాబి . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ని ట్రెండ్ స్తున్నారు అభిమానులు.
ఈ సినిమాలో హనీ రోజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సినిమాపై మరింత హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news