Movies"ఊ అంటావా మావ" కి మించి పోయే రేంజ్ లో పుష్ప2...

“ఊ అంటావా మావ” కి మించి పోయే రేంజ్ లో పుష్ప2 ఐటమ్ సాంగ్.. హీరోయిన్ ఎవరో తెలిస్తే నరాలు జివ్వుమనాల్సిందే..!

వామ్మో ..ఏంటిది పుష్ప2 ఐటం సాంగ్ కోసం ఇంత మంది జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా..?? బాప్ రే ఇది నిజంగా సుకుమార్ క్రియేటివిటీకి పెద్ద పరీక్ష అనే చెప్పాలి. ఏ సినిమాలో అయినా హీరోకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది ..ఆ తర్వాత హీరోయిన్స్ కి..ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి..ఇలా ఉంటుంది . చాలామంది సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తే హీరోయిన్స్ ని పెద్దగా పట్టించుకోరు . అయితే సుకుమార్ సినిమా అంటే మాత్రం హీరోయిన్ కి మించిన ఐటెం సాంగ్ చేసే అమ్మాయి ఎవరు అయ్యి అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు.

కాగా రీసెంట్గా పుష్ప2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్న హీరోయిన్ పేరు నెట్టింట వైరల్ గా మారింది. పుష్ప వన్ సినిమాలో హీరోయిన్ సమంత తన కెరీర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ పార్టీలో పబ్బుల్లో ఊ అంటావా మావ అంటూ ఓ రేంజ్ లో ఊపేస్తూ ఉంటారు జనాలు . అయితే ఈసారి అంతకు మించిపోయిన రేంజ్ లో పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ డిజైన్ చేయబోతున్నాడు సుకుమార్ అన్న వార్త వైరల్ అవుతుంది.

ఈసారి పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేయబోయేది బాలీవుడ్ ముద్దుగుమ్మ అంటూ తెలుస్తుంది. దిశా పటానీ-కృటి సనన్ .. వీళ్ళిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొనిందట. ఇద్దరిలో అల్లు అర్జున్ – సుకుమార్ దిశా పటానికే ఓటు వేశారట . ఆమె కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చేసిందట . త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాకి సంబంధించిన ఐటమ్ సాంగ్ డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక కుర్రాళ్లకి నిద్ర పట్టడం లేదు. ఎప్పుడేప్పుడు దిశా పటానీని నాటు స్టెప్స్ తో చూద్దామా..?? అంటూ వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news