Moviesఎన్టీఆర్ ' దేవ‌ర ' .. ఈ న్యూస్ వింటే తార‌క్...

ఎన్టీఆర్ ‘ దేవ‌ర ‘ .. ఈ న్యూస్ వింటే తార‌క్ ఫ్యాన్స్ విజిల్స్‌కు నో బ్రేక్‌..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా దేవ‌ర‌. 2016లో వ‌చ్చిన జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఇప్పుడు క‌లిసి ప‌నిచేస్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ యేడాది టాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒక్క‌టిగా దేవ‌ర నిల‌వ‌నుంది.

అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా గురించి ఫ్యాన్స్ విజిల్ పెట్టేసే న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దేవ‌ర షూటింగ్ ఇప్ప‌టికే 80 శాతంకు పైగా కంప్లీట్ అయిపోయింది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ షెడ్యూల్‌ ప్రారంభించారు. ఇక్క‌డే రెండు వారాల పాటు ఈ సినిమా షూటింగ్ న‌డుస్తుంది.

దీంతో చాలా వ‌ర‌కు షూటింగ్ పినిష్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే దేవ‌ర రెండు పార్టులుగా వ‌స్తుంద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల ప్ర‌క‌టించారు. ఫ‌స్ట్ పార్ట్ ను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దేవ‌ర ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ట్రేడ్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ సినిమా ఏరియా వైజ్ థియేట్రిక‌ల్ రైట్స్ కొనేందుకు పెద్ద పెద్ద నిర్మాత‌లు రంగంలోకి దిగుతుండ‌డం ఆస‌క్తిగా మారింది.

దేవ‌ర‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. స‌ముద్రం, మ‌త్స‌కారుల నేప‌థ్యంలో దేవ‌ర తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు, టీజ‌ర్‌ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news