Movies' నా సామిరంగ ' 8 రోజుల వ‌సూళ్లు... నాగ్ ఎంట్రీతో...

‘ నా సామిరంగ ‘ 8 రోజుల వ‌సూళ్లు… నాగ్ ఎంట్రీతో ఆ ఇద్ద‌రు హీరోల ప‌రువు పాయే..!

టాలీవుడ్‌లో ఈ యేడాది ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. వెంకీ సైంధ‌వ్‌, మ‌హేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ‌, తేజ స‌జ్జా హ‌నుమాన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో హ‌నుమాన్ ఇప్ప‌టికే డ‌బుల్‌.. త్రిబుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

హనుమాన్ మ‌రో ప‌ది రోజుల పాటు ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. హ‌నుమాన్ త‌ర్వాత సంక్రాంతి సినిమాల్లో రెండో ప్లేసులో ఉన్న సినిమా నాగార్జున నా సామిరంగ‌. టాలీవుడ్ కింగ్ నాగార్జున నా సామిరంగ 8 రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకుంది. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా 44.8 కోట్ల రూపాయలు రాబ‌ట్టింది. తొలి వారం ముగిసే స‌రికే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించి రెండో వారంలోకి అడుగు పెట్టింది.

నా సామిరంగా 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.35 కోట్ల రూపాయల షేర్ రాబ‌ట్టి.. మొత్తం 21.89 కోట్లకు చేరుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 8 రోజుల గ్రాస్ 44.8 కోట్ల రూపాయలు. విచిత్రం ఏంటంటే సంక్రాంతి సినిమాల్లో హ‌నుమాన్‌, నా సామిరంగా రెండూ ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ సాధించేసి లాభాల భాట‌లో ఉన్నాయి. అటు వెంక‌టేష్ సైంధ‌వ్‌, మ‌హేష్‌బాబు గుంటూరు కారం రెండూ కూడా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి.

వెంక‌టేష్‌, మ‌హేష్‌బాబుతో పోలిస్తే నాగ్ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ దాటేయ‌డంతో నాగ్ ఖాతాలో మ‌రో సంక్రాంతి హిట్ ప‌డింది. నాగ్ సంక్రాంతికి వ‌చ్చి బ్రేక్ ఈవెన్ కొట్టి లాభాల్లోకి రావ‌డంతో మ‌హేష్‌బాబు, వెంక‌టేష్ సినిమాల‌తో కంపేరిజ‌న్ వ‌స్తుండ‌డంతో ఈ ఇద్ద‌రు హీరోల‌కు ఎదురు దెబ్బే అని ట్రేడ్ చ‌ర్చ న‌డుస్తోంది.

నా సామిరంగ 8 రోజుల ఏరియా వైజ్ వ‌సూళ్లు :
నైజాం – 26 లక్షలు
సీడెడ్ – 23 లక్షలు
వైజాగ్ – 28 లక్షలు
ఈస్ట్ – 19 లక్షలు
వెస్ట్ – 10 లక్షలు
కృష్ణ -11 లక్షలు
గుంటూరు – 12 లక్షలు

నెల్లూరు – 6 లక్షలు

8 రోజుల ఏపీ, తెలంగాణ = 21.89 కోట్లు

8 రోజుల గ్రాస్ = 44.8 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news