Moviesఆ వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే .. మెగా ఫ్యామిలీని మడత...

ఆ వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే .. మెగా ఫ్యామిలీని మడత పెట్టేయడం ఖాయమే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రీసెంట్గా మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ను ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందో మనం చూసాం . ఒకరు కాదు ఇద్దరు కాదు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అందరూ కలిసి ఒకే చోట సంక్రాంతిని చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు ఈ ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా కూతురు ఆధ్యా కూడా పాల్గొన్నారు.

దీంతో వీళ్ళ ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఎప్పుడు మెగా సెలెబ్రేషన్స్ జరిగిన ఉపాసన – చరణ్- అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ల ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అయ్యేటివి. అయితే ఈసారి మాత్రం ఆధ్యా – అఖీరా ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి. అంతేకాదు అకిరా అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఫొటోస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు .

అంతేకాదు అకిరా ఇండస్ట్రీలోకి వస్తే మిగతా హీరోలను పెద్దగా పట్టించుకోరు అని .. మెగా ఫ్యామిలీ హీరోలను తొక్కి పడేస్తాడు అకిరా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రచ్చ రంబోలా చేస్తున్నారు. ఏ మాటక ఆ మాటే అకిరా కటౌట్ అదిరిపోయింది . పవన్ కళ్యాణ్ ని మించిపోయే రేంజ్ కి వెళ్ళిపోతాడు అని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు పవన్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news