Moviesఫైనల్లీ .. తెలుగు సినిమాకి కమిట్ అయిన సమంత ..హీరో ఎవరంటే..?

ఫైనల్లీ .. తెలుగు సినిమాకి కమిట్ అయిన సమంత ..హీరో ఎవరంటే..?

సమంత ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన సమంత.. రీసెంట్ గా మయోసైటిస్ అనే వ్యాధికి గురైంది. అప్పటినుంచి ట్రీట్మెంట్ కోసం ఆమె పలు దేశాలు తిరుగుతూ వచ్చింది . రీసెంట్గా సమంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది .

ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయింది. అయితే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సినిమాలు నిర్మించాలని అంటూ డిసైడ్ అయింది . ఈ క్రమంలోని బాలీవుడ్ లో రెండు సినిమాలకు కనెక్ట్ అయిన సమంత హాలీవుడ్లో ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపించాయి . తెలుగులో సినిమాలకి ఛాన్స్ లు వస్తున్న రిజెక్ట్ చేస్తూ ఉండడంతో..

అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతోంది అని అంతా అనుకున్నారు . అయితే సమంత తెలుగు హీరో సినిమాకి కమిట్ అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ యంగ్ హీరో సినిమాలో ఆమె నటించబోతుందట . ఇది ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాగా తెలుస్తుంది. దీంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వెల్కమ్ బ్యాక్ సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news