Moviesసైలెంట్ గా చరణ్ కారును ఫాలో చేసిన ఫ్యాన్స్.. లాస్ట్ లో...

సైలెంట్ గా చరణ్ కారును ఫాలో చేసిన ఫ్యాన్స్.. లాస్ట్ లో ఆయన చేసిన పనికి అంతా షాక్(వీడియో)..!!

సాధారణంగా సినిమా స్టార్స్ ఎక్కడ కనిపించినా సరే ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు . ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అంటూ వెన వెనక పడుతూ ఉంటారు. మరి కొంతమంది ఫ్యాన్స్ ఆ హీరోలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లడానికి ట్రై చేస్తూనే ఉంటారు . ఇలాంటి సిచువేషన్స్ మన ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఎదుర్కొని ఉన్నారు . కాగా రీసెంట్గా అలాంటి సిచువేషన్ ని ఫేస్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఎస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్ లో జరుగుతుంది . అయితే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ షూటింగ్ ముగించుకొని ఇంటికి బయలుదేరి వస్తూ ఉండగా అది తెలుసుకున్న అభిమానులు ఆయనను వెంబడించారు . ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం అలాగే వచ్చారు .

దీంతో గమనించిన రామ్ చరణ్ కారును స్లో చేసి రామ్ చరణ్ వారందరికీ అభివాదం తెలిపి “దయచేసి డ్రైవింగ్ స్లోగా చేయండి అంటూ రిక్వెస్ట్ చేసి ..అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నన్ను ఫాలో అవ్వద్దు అంటూ సైగ చేశారు”. ప్రెసెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఎవ్వరైనా సరే ఆ స్థానంలో ఉంటే కచ్చితంగా సెక్యూరిటీని పిలిపించి పెద్ద ఇష్యూ చేసేవారు . కానీ రామ్ చరణ్ మనసు ఎంతో మంచిది అందుకే ఆయన ఇలా చేశాడు అంటున్నారు రామ్ చరణ్ అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news