Moviesయూఎస్ మార్కెట్లో రిలీజ్‌కు ముందే ' స‌లార్ ' ఊచ‌కోత‌... కుమ్మి...

యూఎస్ మార్కెట్లో రిలీజ్‌కు ముందే ‘ స‌లార్ ‘ ఊచ‌కోత‌… కుమ్మి కుమ్మి వ‌దులుతోన్న ప్ర‌భాస్‌..!

ప్రస్తుతం పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఎక్సైట్మెంట్‌తో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా సలార్. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ మాస్ రోల్‌ని ఈ సినిమాలో చేయిగా సలారుగా ప్రభాస్ చేసే విధ్వంసాన్ని ఎంతో ఆసక్తితో చూసేందుకు ఇండియన్ సినీ ప్రేక్షకులు అంతా కాచుకుని ఉన్నారు. ఇక రెండో ట్రైలర్ వచ్చిన తర్వాత సలార్ సినిమాపై హైప్‌ మరింత పెరుగుతోంది.

అందరూ అనుకున్నట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో యుఎస్ మార్కెట్ ను స‌లార్ షేక్ చేస్తూ దూసుకు వెళుతుంది. ఈ సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందుగానే జస్ట్ ప్రీమియర్స్ తోనే రెండు మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసింది. దీనిని బట్టి యూఎస్ మార్కెట్లో సలార్ హవా ఏ రేంజ్‌లో ? ఉందో తెలుస్తోంది ఇక ఫస్ట్ డే ముగిసేసరికి సలార్ యూఎస్ మార్కెట్లో నాలుగు మిలియన్ డాలర్ల వసూళ్లను క్రాస్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మించిన ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ర‌వి బ్ర‌సూర్ సంగీతం అందించారు. ఈ రోజు అర్ధ‌రాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో స‌లార్ హంగామా స్టార్ట్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news