Newsఅర్జున్ రెడ్డి సినిమాలో ఫ‌స్ట్ అనుకున్న హీరోయిన్ శాలినీ కాదు... మ‌న...

అర్జున్ రెడ్డి సినిమాలో ఫ‌స్ట్ అనుకున్న హీరోయిన్ శాలినీ కాదు… మ‌న తెలుగ‌మ్మాయే…!

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో ఎంతటి సంచలనం సృష్ఠించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా నిర్మాణానికే చాలా సమయం తీసుకున్నారు. కారణం సొంత నిర్మాణ సంస్థ కావడం..వేరే సంస్థలు సందీప్ చెప్పిన కథ తో నిర్మించాలంటే భయపడి వెనక్కి తగ్గాయి. దాంతో సందీప్ అన్న నిర్మాతగా వ్యవహరించాడు.

ఇక తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారు అర్జున్ రెడ్డి సినిమా వెనక ఉన్నారు. సినిమా ఆలస్యం అవుతుందని దర్శకుడు సందీప్ రెడ్డిని కోప్పడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, అసలు విషయం బడ్జెట్ లేకనే. నందినీ రెడ్డి లాంటి వారందరూ ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ట్రైలర్ చూసి కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తే కొందరూ పాజిటివ్ కామెంట్స్ చేశారు.

ఇక వీహెచ్ లాంటి వారు తెగ తిట్టిపోశారు. అయినా అర్జున్ రెడ్డిలో కథా బలం అందరినీ ఆకట్టుకుంది. యూత్ ఆడియన్స్ మాత్రమే కాదు ప్రతీ ఒక్కరినీ అలరించింది. ముఖ్యంగా శాలినీ పాండే సినిమాకి ప్లస్ పాయింట్. దర్శకుడు చెప్పినన్ని ముద్దులు పెట్టింది. ఎలా చేయమంటే అలా రొమాంటిక్ సీన్స్ చేసింది. సినిమా హిట్ కారణం సందీప్ కథ కథనం ఎంత ముఖ్యమయ్యాయో విజయ్ దేవరకొండ, శాలినీపాండే అంతకన్నా ముఖ్యం అయ్యారు.

అయితే, వాస్తవంగా అర్జున్ రెడ్డి సినిమా కోసం ముందు తెలుగమ్మాయి రీతూవర్మని అనుకున్నారట. పెళ్లి చూపులు సినిమాలో విజయ్-రీతూల జంట అందరినీ ఆకట్టుకుంది. అందుకే సందీప్ ఇదే జంటను రిపీట్ చేయాలనుకున్నారు. కానీ, కథలో ఇన్ని ఇంటిమేట్ సీన్స్ ఉంటాయని తెలిసి నిర్మొహమాటంగా రీతూ వర్మ రిజెక్ట్ చేసిందట. దాంతో నార్త్ నుంచి శాలీనీని తీసుకున్నారు. ఆమెకి సినిమాలో ఇన్ని ముద్దులున్నాయని ముందు చెప్పలేదట. లేదంటే నేను ఒప్పుకునేదాన్ని కాదని శాలినీ ఓ సందర్భంలో చెప్పింది కూడా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news