Movies' భ‌గవంత్ కేస‌రి ' క‌థ వెన‌క బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా...

‘ భ‌గవంత్ కేస‌రి ‘ క‌థ వెన‌క బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఉంద‌ని తెలుసా…!

బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి సినిమా ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది బాలయ్యకు వరుసగా మూడో విజయం. అఖండ, వీర సింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య మూడో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. నిజం చెప్పాలి అంటే 30 సంవత్సరాల తర్వాత బాలయ్యకు వరుసగా మూడు సూపర్ హిట్లు పడ్డాయి. భగవంత్‌ కేసరి సినిమాలో ప్లాష్‌బ్యాక్‌లో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు.

అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కథ రాసేటప్పుడు ఆ పోలీస్ పాత్రను ఎలా రాసుకున్నారో తెలిస్తే ఆసక్తిగా అనిపిస్తుంది. ముందుగా బాలయ్యను ఓ ట్రైబల్ మనిషిగా చూపించాడట. బాలయ్యకు కథ అంతా నచ్చిన ఆ ట్రైబల్ బ్యాక్ డ్రాప్ మార్చి ఇంకేదైనా పెట్టమని రిక్వెస్ట్ చేశాడట. బాలయ్య పదేపదే అది మార్చమని చెప్పడంతో వెంటనే అనిల్ రావిపూడి మ‌దిలో బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ సినిమా రౌడీ ఇన్‌స్పెక్టర్ గుర్తుకు వచ్చిందట.

సార్ పోలీస్.. అనగానే బాలయ్య వెంటనే ఐడియా అదిరిపోయింది అని చెప్పడంతో.. ఫ్లాష్ బ్యాక్ లో ఆదిలాబాద్ లో అడవుల్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్యను చూపించారు. పోలీస్ గెటప్‌లో బాలయ్య నట విశ్వరూపం ఏ రేంజ్‌లో ? ఉందో మనం చూశాం. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా భగవంత్ కేసరి ఇంకా కొన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య.. బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news