Moviesఅమ్మ బాబోయ్.. ఆఖరికి మన మహేష్ బాబు కూడా హోస్ట్ గా...

అమ్మ బాబోయ్.. ఆఖరికి మన మహేష్ బాబు కూడా హోస్ట్ గా మారిపోతున్నాడా..? ఏ షో కోసం అంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు బుల్లితెరపై ఓటీటీలలో వచ్చే షో లకు హోస్టులుగా కనిపిస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు , ఎన్టీఆర్ బిగ్ బాస్ .. ఆ తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు, నాగార్జున – నాని బిగ్ బాస్ షోను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత బాలకృష్ణ ఏకంగా అన్ స్టాపబుల్ షో ద్వారా హోస్టుగా మారారు . ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయిపోతున్నాడు మహేష్ బాబు అంటూ ఓ న్యూస్ సొషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే మాటీవీలో ప్రసారం కాబోయే ఓ సరికొత్త గేమ్ షోను మహేష్ బాబు హోస్ట్ చేయబోతున్నాడట . అంతేకాదు ఇది ఫుల్ టు ఫుల్ టాలెంట్ గేమ్ షో గా తెలుస్తుంది.

కౌన్ భనేగా కరోడ్ పతి షోకి అమ్మ మొగుడిలా ఈ షో ని డిజైన్ చేసిందట మా యాజమాన్యం . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రజెంట్ సినీ మహేశ్ బాబు గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు . ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా కి కమిట్ అయ్యాడు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news