Newsరష్మిక పై అలా.. తృప్తి దిమ్రి పై ఇలా.. యానిమల్ సినిమా...

రష్మిక పై అలా.. తృప్తి దిమ్రి పై ఇలా.. యానిమల్ సినిమా పై అల్లు అర్జున్ రివ్యూ కేక..!!

అర్జున్ రెడ్డి .. లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తరువాత..సందీప్ రెడ్డి వంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా యానిమల్. రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసింది . అంతేకాదు ఏకంగా 500 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది .

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీస్ రివ్యూ ఇచ్చారు . కాగా తాజాగా టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు . యానిమల్ సినిమా గురించి ..రన్బీర్ కపూర్ యాక్టింగ్ గురించి ..రష్మిక మందన్నా బోల్ పర్ఫామెన్స్ గురించి.. న్యూడ్ క్యారెక్టర్ చేసిన తృప్తి దిమ్రి గురించి చాలా చాలా బాగా ఒక్కొక్క లైన్లో వివరించారు .

అయితే రష్మిక నటన బ్రిలియంట్ అండ్ మాగ్నెటిక్ అంటూ చెబుతూనే న్యూడ్ పాత్రలో కనిపించిన తృప్తి దిమ్రి పై హాట్ బ్రేక్స్ చేసిందని ..ఈ యంగ్ లేడీ కి చాలా భవిష్యత్తు ఉంది అంటూ పొగిడేసారు . దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రివ్యూ వైరల్ గా మారింది. మొత్తానికి పుష్పగాడికి రష్మిక నటన కంటే తృప్తి పర్ఫామెన్స్ నే బాగా నచ్చేసింది అని ఒక్క మాట తోనే చెప్పేశాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news