News"వదినమ్మ వచ్చింది ..అయితే ఏంటి..? ఇప్పుడు ఏం పీకాలి..?..నీహారిక పోస్ట్ వైరల్..!!

“వదినమ్మ వచ్చింది ..అయితే ఏంటి..? ఇప్పుడు ఏం పీకాలి..?..నీహారిక పోస్ట్ వైరల్..!!

హమ్మయ్య .. అయిపోయింది కోట్లాదిమంది మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలో వీళ్ళ పెళ్లి కుటుంబ సభ్యుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది . దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

కాగా ఈ క్రమంలోనే నిహారిక తన అన్న వరుణ్ తన వదిన లావణ్య త్రిపాఠిలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “వదినమ్మ వచ్చేసింది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది . దీనితో చాలామంది నిహారిక కు పాజిటివ్గా కామెంట్స్ చేస్తుంటే ..కొందరు మాత్రం నిహారిక విడాకులను గుర్తు చేసి ఆమెను బాధపెడుతున్నారు . “వదినమ్మ వచ్చింది సరే నీ మొగుడు ఎక్కడ..?” అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే..

మరికొందరు పచ్చి బూతు పదాలను తిడుతున్నారు . మరికొందరు “వదినమ్మ వచ్చింది నీ మొగుడు వెళ్లిండు.. అయితే ఏంటి ..? ఏం పీకాలి ..? “అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరు “వాళ్లను చెడగొట్టకు అంటూ బూతు పదంతో కామెంట్ పెట్టాడు”. ఇలా నిహారిక మంచి పోస్టు పెట్టిన సరే జనాలు ఎందుకో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మెగా ఫాన్స్ కూడా ఫైర్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news