Newsనాగార్జున-నదియా కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? సెట్ అయ్యుంటే...

నాగార్జున-నదియా కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? సెట్ అయ్యుంటే మరో మన్మధుడే..!!

యంగ్ హీరో హీరోయిన్స్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు . వాళ్ళ బిజీ కాల్ షెడ్యూల్స్ కారణంగా కావచ్చు లేకపోతే మరి ఏదైనా కారణాలు చేత కావచ్చు కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే సీనియర్ హీరో హీరోయిన్లు కూడా కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అయ్యాయా..? అంటే ఎస్ అన్న సమాధానం వినిపిస్తుంది .

ఆ లిస్టులోకే వస్తాడు నాగార్జున – నదియా . వీళ్ళిద్దరి కాంబోలో సినిమా మిస్ అయిపోయింది . ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ న్యూస్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా సోగ్గాడే చిన్నినాయన . ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో నదియాను అనుకున్నారట మేకర్స్.

అయితే ఆమె ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . కొన్ని సన్నివేశాలలో నాగార్జున నడుము గిల్లే సీన్స్.. కానీ కొంచెం రొమాంటిక్ గా మాట్లాడే సీన్స్ కానీ ఆమె యాక్సెప్ట్ చేయలేకపోయారట . ఆ కారణంగానే నదియా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట . దీంతో వీళ్ళ కాంబో అక్కడితోనే ఫుల్ స్టాప్ పడిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news