Newsకోలీవుడ్ కి సూర్య-జ్యోతిక.. టాలీవుడ్ కి ఈ జంట.. ఆ విషయంలో...

కోలీవుడ్ కి సూర్య-జ్యోతిక.. టాలీవుడ్ కి ఈ జంట.. ఆ విషయంలో దొందూ దొందే..!!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సూర్య హీరోయిన్ జ్యోతికల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీరిద్దరూ కెరియర్ టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఒకే సినిమా చేస్తున్న టైంలో ప్రేమలో పడిన ఈ జంట మొదట ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకొని ఆ తర్వాత పెద్దలు వీళ్ళ పెళ్లిని ఘనంగా నిర్వహించారు . వీళ్ళ పెళ్లి కోలీవుడ్ లోనే ఓ సెన్సేషన్ గా నిలిచింది . అయితే సేమ్ ఇదేవిధంగా టాలీవుడ్ లో కూడా ఓజంట ఉన్నారు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది .

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య జ్యోతికల జంట ఎంత పాపులారిటీ దక్కించుకుందో .. టాలీవుడ్ లో కూడా మహేష్ బాబు నమ్రతల జంట అంతే పాపులారిటీ దక్కించుకుంది. వీళ్ళు కూడా అంతే వంశీ సినిమా షూట్ చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డారు . అంతేకాదు వీళ్ళు కూడా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ నమ్రత అందుకు ఒప్పుకోలేదు .

ఇంట్లో కుటుంబ సభ్యులను ఒప్పించే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఫైనల్లీ అనుకున్నది సాధించారు. అంతేకాదు ఎక్కడ కూడా జ్యోతిక సూర్య రొమాంటిక్ ఫొటోస్ గాని వల్గర్ ఫొటోస్ కానీ కెమెరాకి ఇచ్చింది లేదు . ఇన్నేళ్ల తమ సినీ కెరియర్ వైవాహిక జీవితంలో ఎప్పుడు కూడా హద్దులు మీరింది లేదు. అదేవిధంగా నమ్రత మహేష్ బాబు కూడా ఎప్పుడూ హద్దులు మీరి ప్రవర్తించలేదు . దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీకి సూర్య జ్యోతిక ఎలాగనో టాలీవుడ్ ఇండస్ట్రీకి మహేష్ బాబు నమ్రత కూడా అలాగని అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news