Newsహీరోయిన్ ఛాన్స్ కోసం డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు బికినీ ఫోటోలు పంపిన హీరోయిన్‌......

హీరోయిన్ ఛాన్స్ కోసం డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు బికినీ ఫోటోలు పంపిన హీరోయిన్‌… దిమ్మ‌తిరిగే ట్విస్ట్ ఇచ్చాడుగా…!

సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆమె అన్నమయ్య , పెద్దరికం, భారతీయుడు లాంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలలో కస్తూరి తన నటనతో కట్టిపడేసింది. సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి సినిమాలు చేసిన కస్తూరికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇండస్ట్రీలో తనకు నచ్చిన విషయంతో పాటు ఏదైనా నచ్చలేదంటే చాలా ఓపెనింగ్ గానే తన అభిప్రాయం చెప్పే గట్స్ ఆమెకు ఉన్నాయి. అయితే ఒక్కోసారి ఆమె కామెంట్లు కాంట్రవర్సీ అవడంతో పాటు భారీగా వైరల్ అవుతూ ఉంటాయి .

ప్రస్తుతం కస్తూరి సౌత్ ఇండియన్ బుల్లితెరను ఊపేస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసి పాత్రలో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే కస్తూరి ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉంటుంది.కస్తూరి తన కెరీర్ ప్రారంభం రోజులను గుర్తు చేసుకుంటూ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. కెరీర్ ప్రారంభంలోనే తనకు శంకర్ లాంటి దర్శకుడి తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని.. ఆయనతో కలిసి పనిచేయటం ఎంత లక్కీ చాన్సో నాకు తర్వాత రోజుల్లో తెలిసిందని చెప్పింద‌ని పేర్కొంది.

అప్పుడది చిన్న వయసు కాబట్టి ఏదో సరదాగా చేసేసానిని తెలిపింది. కమలహాసన్ హిట్ సినిమా భారతీయుడులో ముందుగా హీరోయిన్ ఛాన్స్ కస్తూరికే వచ్చింది. ఆ సినిమా విషయంలో సంప్రదింపులు జరుగుతున్న టైంలో ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని డైరెక్టర్ శంకర్ కి కస్తూరి బికినీ ఫోటోలు కూడా పంపించిందట. అదే సమయంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఊర్మిళ హీరోయిన్గా రంగీలా సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఊర్మిళ గురించి చర్చించుకుంటున్నారు.

దీంతో భారతీయుడు సినిమా మేకర్స్ అటెన్షన్ ఊర్మిళ వైపు మళ్ళింది. చివరకు ఊర్మిళ‌ను హీరోయిన్గా ఫైనల్ చేసి కస్తూరికి కమలహాసన్ చెల్లి పాత్ర ఇచ్చి సరిపెట్టేసారు . అలా భారతీయుడికి కుమార్తెగా నటించారు . కొద్ది రోజుల తర్వాత ఏంటి సార్ ఇలా చేశారు అని అడిగితే… సినిమాలో ఇది ఒక కీలకమైన పాత్ర అని చెప్పడంతో తాను తప్పనిసరి పరిస్థితుల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని కస్తూరి వాపోయింది. అలా కమలహాసన్ పక్కన హీరోయిన్గా నటించే ఛాన్స్ మిస్ అయిందని కస్తూరి వాపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news