Newsనిహారిక ల‌వ్ లెట‌ర్‌... అందులో ఏం ఉంది.. ఎవ‌రికి రాసింది...!

నిహారిక ల‌వ్ లెట‌ర్‌… అందులో ఏం ఉంది.. ఎవ‌రికి రాసింది…!

మెగా డాటర్ నిహారిక కొణిదల టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిహారిక ఇటీవల వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లిలో సందడి చేసింది. తన అన్న పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.. ఇటలీలో జరిగిన గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఈ పెళ్లిలో నిహారిక మరో పెద్ద బాధ్యత కూడా తీసుకుంది.. పెళ్లి ఏర్పాట్లు మొత్తం తన క‌నుస‌న్న‌ల్లో జరిగేలా చేసింది.

పెళ్లి తంతు ముగిశాక నిహారిక ఇప్పుడు 15 మంది కొత్త నటీనటులతో ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి కొత్త దంపతులు వరుణ్ – లావణ్య కూడా హాజరయ్యారు. ఇప్పటికే నిహారిక బుల్లితెరపై పలు ఓటీటీ షోలు నిర్మించింది. ఇప్పుడు ఏకంగా వెండితెరపై సినిమా నిర్మిస్తూ నిర్మాతగా మారుతుంది. తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది.

ఈ వీడియోలో ఆమె ఓ లవ్ లెటర్ రాసుకు వచ్చింది. తనకు అత్యంత ఇష్టమైన వారికి అంతేకాకుండా తన జీవితంలో స్ఫూర్తిగా నిలిచిన వారందరికీ ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ ఒక్క వీడియోలోనే తాను ప్రేమిస్తున్న వారు అందరూ వచ్చేలా పోస్ట్ చేసింది. వీడియోతో పాటు లవ్ లెటర్ టు ఆల్ మై ఏంజెల్స్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఈ వీడియోలో లావణ్య త్రిపాఠి – శ్రీజ కొణిదెల – జ్యోతిరాజ్ సందీప్ – నిహారిక తల్లి కూడా ఉన్నారు. నా జీవితంలోకి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు అని తెలిపింది. మీతో గడిపిన క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ప్రస్తావించింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సైతం నిహారిక అభిమానానికి ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news