Newsఆ విషయంలో కూల్ గా తప్పించుకున్న నాగార్జున.. అడ్డంగా బుక్కైన బాలయ్య.....

ఆ విషయంలో కూల్ గా తప్పించుకున్న నాగార్జున.. అడ్డంగా బుక్కైన బాలయ్య.. సంవత్సరాలు గడుస్తున్న నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని గాయం ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే కొంతమంది హీరోస్ ని ఫ్యాన్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా టాలీవుడ్ అనగానే అందరికీ గుర్తొచ్చే నాలుగే నాలుగు పేర్లు చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ . ఈ నలుగురు సినిమాలు అప్పట్లో ఎలాంటి హిట్స్ అందుకున్నాయో మనకు తెలిసిందే. కాగా సినిమా ఇండస్ట్రీ లో తన కెరియర్ జెట్ స్పీడ్ గా తీసుకోబోతున్న టైంలోనే బాలయ్యకు ఒకానొక టైం లో వరుసగా ఫ్లాప్స్ పడుతూ వచ్చాయి .

ఎలా అంటే అసలు బాలయ్యకు సక్సెస్ అనేది చాలా దూరంగా ఉండింది . అలాంటి క్రమంలోనే ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయన కెరియర్ను మరింత కష్టాల్లోకి నెట్టేసింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో బాలకృష్ణ చేసిన మూవీ కృష్ణ బాబు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది . అయితే నిజానికి ఈ సినిమాలో హీరోగా ముందుగా డైరెక్టర్ నాగార్జునను అనుకున్నారట .

ఆయనకు కథ కూడా వివరించారట . కానీ పెద్ద డైరెక్టర్ కావడం కధ నచ్చకపోవడంతో నాగార్జున సున్నితంగా హెల్త్ బాగోలేదు అంటూ ఈ సినిమా నుంచి తప్పించుకున్నారట . అయితే బాలకృష్ణ మాత్రం అలా తప్పించుకోలేకపోయారు . కథ ప్లాప్ అవుతుంది అని తెలిసిన సరే పెద్ద డైరెక్టర్ మనకు కావాల్సిన డైరెక్టర్ అంటూ సినిమా చేసి పెట్టాడు . ఈ సినిమా తర్వాత బాలయ్య హిట్ కొట్టడానికి చాలా టైం పట్టింది . అలా నాగార్జున ముందు తెలివితో ఈ సినిమాను రిజెక్ట్ చేస్తే బాలయ్య ఫ్రెండ్షిప్ కారణంతో తన ఖాతాలో వేసుకొని ఫ్లాప్ ని చవిచూశాడు . సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా ఈ సినిమా మిగిల్చిన గాయం నందమూరి అభిమానులకు మానలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news