Newsఇంట్రెస్టింగ్ సర్వే: ఎంత మంది హీరోలు ఎన్ని కోట్లు తీసుకున్న..టాలీవుడ్ నెం...

ఇంట్రెస్టింగ్ సర్వే: ఎంత మంది హీరోలు ఎన్ని కోట్లు తీసుకున్న..టాలీవుడ్ నెం 1 హీరో మాత్రం అతనే..!!

సినిమా ఇండస్ట్రీలో మా హీరో గొప్ప అంటే .. మా హీరో గొప్ప అంటూ చాలామంది చెప్పుకొని తిరుగుతూ ఉంటారు . మరి ముఖ్యంగా మా హీరోనే నెంబర్ వన్ అంటూ చాలామంది ఫ్యాన్స్ ఇప్పటికి తమ డప్పు తామే కొట్టుకుంటూ ఉంటారు . అయితే రీసెంట్గా ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మ్యాక్స్.. దేశవ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహించి ఏ హీరో టాప్ ఏ హీరో నెక్స్ట్ అన్న విషయాలను చెప్తూ ఉంటారు.

రీసెంట్గా ఈ నెలకు సంబంధించిన సర్వేను రిలీజ్ చేసేంది ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మాక్స్. ఈ క్రమంలోనే అక్టోబర్ నెల కు సంబంధించిన లిస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఎప్పటిలాగే ఈసారి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు రెబెల్ హీరో ప్రభాస్ . ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ .. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ మాత్రం తగ్గలేదు.

అందుకే ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు . రెండవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ..మూడవ స్థానంలో అల్లు అర్జున్.. నాలుగవ స్థానంలో రామ్ చరణ్ ఐదవ స్థానంలో మహేష్ బాబు.. ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ ..ఏడవ స్థానంలో నాని ఉన్నారు . ఇక ఎనిమిది , తొమ్మిది , పదవ స్థానాలలో విజయ దేవరకొండ ,మెగాస్టార్ చిరంజీవి ,రవితేజ నిలిచారు . ఇలా ఇండస్ట్రీలో టాప్ హీరో ప్రభాస్ అంటూ మరోసారి ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మ్యాక్స్ క్లియర్ కట్ గా వెల్లడించేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news