Newsమాజీ భార్య స‌మంత‌కు స‌వాల్ విసిరిన చైతు... సామ్ చేతులు ఎత్తేసిన‌ట్టేనా..!

మాజీ భార్య స‌మంత‌కు స‌వాల్ విసిరిన చైతు… సామ్ చేతులు ఎత్తేసిన‌ట్టేనా..!

టాలీవుడ్ లో మాజీ భార్యాభర్తలు అయినా నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. వీరు విడిపోయిన తర్వాత ఇద్దరి సినిమా కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. ఇటు చైతు నటిస్తున్న సినిమాలు వరుసగా ప్లాపులు అవుతున్నాయి. అటు సమంత నటించిన యశోద యావరేజ్, శకుంతలం అతిపెద్ద డిజాస్టర్, ఖుషి టాక్ మంచిగా వచ్చినా కూడా సరిగా ఆడలేదు.

సమంత చరిష్మా తగ్గిపోయిందని చెప్పేందుకు ఖుషి రిజల్ట్ నిదర్శనం అన్న చర్చలు ట్రేడ్ వర్గాల్లో నడుస్తున్నాయి. ఇక విచిత్రంగా ఇప్పుడు ఇద్దరూ కలిసి మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల కోసం ఇటలీ వెళ్లారు. ఇక ఇద్దరు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల‌లో కూడా నటిస్తున్నారు. సమంత ఇప్పటికే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఆమె నటించిన మరో సిరీస్ సీటాడెల్‌ మాత్రం ఇప్పట్లో ప్రేక్షకులు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సమంత వెబ్ సిరీస్ కు పోటీగా నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ధూత వెబ్ సిరీస్ చేశారు. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ విషయంలో నిన్న మొన్నటి వరకు గందరగోళం గానే ఉంది. అయితే ధూత వెబ్ సిరీస్ రిలీజ్ విషయంలో అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇచ్చేసింది.

ధూత మొత్తం ఎనిమిది భాగాలుగా తెరకెక్కింది. ఒక్కో భాగం 45 నిమిషాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది డిసెంబర్ నుంచి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున స్ట్రీమింగ్ కానుంది. విచిత్రం ఏంటంటే సిటాడెల్ కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. ఇప్పుడు ధూత వెబ్ సిరీస్ ముందుగా రిలీజ్ చేస్తుండడంతో సిటాడెల్‌ను మరింత ఆలస్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సమంత కంటే ముందుగా తన వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేయిస్తున్న చైతు ఆమెకు సవాల్ విసిరినట్టే చెప్పాలి. మరి సమంత కూడా చైతు ధూతకు పోటీగా సెటాడెల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా..? మరికొన్ని నెలలపాటు ఆమెకు ఎదురుచూపులు తప్పవా..? అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news