Movies"తగ్గే కొద్ది మిం**గుతారు.. ప్రతి నా కొడుకు అంతే"..విశ్వక్ సేన్ పోస్ట్...

“తగ్గే కొద్ది మిం**గుతారు.. ప్రతి నా కొడుకు అంతే”..విశ్వక్ సేన్ పోస్ట్ ఆ తెలుగు హీరోకేనా..?

హీరో విశ్వక్సేన్ కూసింత హద్దులు మీరాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో కి వచ్చాక కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే స్టార్ హీరోలుగా మారగలరు. అయితే తొందరపడి టంగ్ స్లిప్ అయినా లేక పొరపాటున.. మాటతూలిన దానికి తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అలా కోపంలో టంగ్ స్లిప్పయి సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురవుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్.

ఆయన ఇస్టా స్టోరీలో రాసుకొస్తూ..”బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు గేర్ మారుద్దామని అనుకుంటాడు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పనిచేసే చెబుతున్న.. నా సినిమా డిసెంబర్ 8 కి వస్తుంది. హిట్ చేస్తారో .. ఫ్లాప్ చేస్తారో..సూపర్ హిట్.. చేస్తారో ..అట్టర్ ఫ్లాప్ చేస్తారో ఏమో నాకు తెలియదు ..అంతా మీకే వదిలేస్తున్నా .. నేను ఆవేశం లోనో ఈగోకి పోయి ఈ నిర్ణయం తీసుకోలేదు . ఒకటి అర్థమైంది తగ్గే కొద్దీ ప్రతి నా కొడుకు మింగుతాడు అని అర్థమైంది . డిసెంబర్ కాకపోతే నేను ప్రమోషన్ లో కనిపించను. గంగమ్మ మీద ఒట్టేసిచెబుతున్నా మహంకాళి మాతో ఉంది . డిసెంబర్ లో కనుక మా సినిమా విడుదల కాకపోతే.. ఇకపై నేను ప్రమోషన్స్ లో కనిపించను నన్ను చూడలేరు “అంటూ రాసుకోచ్చాడు .

అయితే డిసెంబర్ 7 , 8 తేదీలలో నితిన్ – నాని – వరుణ్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ని రేస్ నుంచి తప్పించడానికి ఓ హీరో చాలా ట్రై చేస్తున్నాడట. మేకర్స్ కూడా అదే నిర్ణయాన్ని ఫైనల్ చేస్తున్నారని .. సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే విశ్వక్సేన్ తెలుగు హీరోలను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news