Newsముమైత్ ఖాన్ కెరీర్ నాశ‌నం కావ‌డానికి ఆ న‌టుడే కార‌ణ‌మా... ఎవ‌రా...

ముమైత్ ఖాన్ కెరీర్ నాశ‌నం కావ‌డానికి ఆ న‌టుడే కార‌ణ‌మా… ఎవ‌రా న‌టుడు..!

ముమైత్ ఖాన్ గురించి మన తెలుగు జనాలకి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేస్తూ తనదైన మేనరిజంతో పెద్ద ఎత్తున ఇక్కడ కుర్రకారులను ఉత్తేజ పరిచింది. అందుకే నేటికీ ముమైత్ అంటే మనవాళ్లు పడిఛస్తారు అని చెప్పుకోవచ్చు. ముమైత్ ఖాన్ స్పెషల్ సాంగ్ లేని సినిమా అంటూ వచ్చేది కాదు అప్పట్లో. ఈ క్రమంలోనే పోకిరి సినిమాలో ఈమె చేసిన స్పెషల్ సాంగ్ మరో లెవల్లో హిట్ అయిందని ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి.

ఇలా ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ముమైత్ ఖాన్ ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో కనబడకుండా పోయింది. దాంతోనే ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఏంటి ? అనే చర్చ బయట నడుస్తున్నవేళ ఒక విషయం బయటపడింది.

ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే మరొక నటుడితో ఎఫైర్స్ పెట్టుకోవడం ఒక కారణం ఒకటయితే, ఈమె డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం మరొక కారణమని ఇపుడు గుసగుసలు వినబడుతున్నాయి.
విషయం ఏమిటంటే ఈమె ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీగా కొనసాగుతున్న సమయంలో ఒక సినిమా వేడుకలో ప్రముఖ కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యూంతో పరిచయం కాస్త ప్రేమకు దారితీసిందట.

దాంతో కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలినటువంటి ఈ జంట పెళ్లి కూడా చేసుకోవాలని భావించారట. అయితే వీరిద్దరి పెళ్లికి అలీ కుటుంబం నుంచి ఏ మాత్రం అంగీకారం రాలేదట. దాంతో తప్పనిసరి పరిస్థితులలో వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని వినికిడి. అనంతరం ఖయ్యూం మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు… అది వేరే విషయం. కాగా లోగుట్టు పెరుమాళ్లకెరుకగాని ఇపుడు ఖయ్యూమ్ వలనే ఆమె జీవితం నాశనం అయిందనే వార్తలు వినబడుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news