Movies"తప్పు అని తెలుసు..కానీ చేస్తున్న"..శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

“తప్పు అని తెలుసు..కానీ చేస్తున్న”..శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

శ్రీ లీల ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . పేరుకి కన్నడ బ్యూటీ నే అయినా తెలుగులో పలు సినిమాల్లో నటించి క్రేజ్ పాపులారిటీ దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోయిన శ్రీ లీల ప్రజెంట్ బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది . ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ లీల అసలు డాక్టర్ ఎందుకు కావాలి అనుకునింది అన్న విషయంపై ఓపెన్ అయింది.

అంతేకాదు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది . ఈ క్రమంలోనే ఓసారి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగోలేకుండా వచ్చిందట . ఆమె కింద పడిపోయిందట. అందరు లాగే తాను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయానే తప్పిస్తే హెల్ప్ చేయాలి అని ఉన్న ఏం చేయాలో తెలియదు అని అప్పుడే మా అన్నయ్య డాక్టర్ కావడంతో వచ్చే ట్రీట్మెంట్ అందించి.. ఆమెను సేవ్ చేశాడు అని చెప్పుకొచ్చింది. అప్పుడే డాక్టర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఆ తర్వాత చాలా సార్లు నేను ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ మరోవైపు చదువుకోవడం ఇబ్బందిగా అనిపించింది . ఇప్పటికీ పగలు షూటింగ్ రాత్రి చదువు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ..నిజానికి నేను తప్పు చేస్తున్నాను అన్న విషయం కూడా తెలుసు కానీ ఇష్టంగా చేస్తే తప్పు కూడా ఒప్పుగా మారిపోతుంది. అందుకే నాకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ను సినిమాలు చేస్తూనే డాక్టర్ కావాలన్న కలను కూడా నెరవేర్చుకోవడానికి రాత్రి కష్టపడుతున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీనితో శ్రీలీల కామెంట్స్ కి ఫిదా అయిపోయారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news