Newsఅల్లు అర్జున్ కేరవాన్ డ్రైవర్ నెలజీతం తెలుసా.. బోన‌స్‌లే ల‌క్ష‌ల్లో...!

అల్లు అర్జున్ కేరవాన్ డ్రైవర్ నెలజీతం తెలుసా.. బోన‌స్‌లే ల‌క్ష‌ల్లో…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం అభిమానులకు విదితమే. అల్లు అర్జున్ తన వద్ద ఉన్నటువంటి తన స్టాఫ్ కి ఎప్పుడు కూడా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని చిత్ర పరిశ్రమలో టాక్ వుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే, అల్లు అర్జున్ షూటింగ్ సమయంలో వాడుతున్న కారవాన్ గురించి వినే వుంటారు. ఈ క్రమంలోనే తన కేరవాన్ డ్రైవర్ లక్ష్మణ్ గురించి తాజాగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో అల్లువారి అభిమానులు తమ హీరో తోపు, తురుము అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. అవును, లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు బ‌య‌ట పెట్టాడు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నేను అల్లు అర్జున్ గారికి వీరాభిమానిని. తాను మొదట బోయపాటి శీను గారి దగ్గర పనిచేశాను. అలా బోయపాటి గారి నుంచి తాను అల్లు అర్జున్ వద్దకు వచ్చానని తెలియజేశారు. అల్లు అర్జున్ గారిది చాలా గొప్ప మంచి మనసు అని, అలా వైకుంఠపురం సినిమా విడుదలైన తర్వాత మేము ఎవరు కూడా ఊహించని విధంగా ఆయన మాకు బోనస్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును కానుకగా ఇచ్చారని లక్ష్మణ్ ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. ఇలా అల్లు అర్జున్ అభిమానిగా ఈయన ఏకంగా అల్లు అర్జున్ పేర్లను టాటూగా వేయించుకోవడం చూస్తుంటే ఆయన పట్ల ఎంతో అభిమానాన్ని కలిగి ఉన్నారో తెలుస్తోంది.

క్యారవాన్ ఎలా మైంటైన్ చేయాలి ఎలా డ్రైవ్ చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా తాను శిక్షణ తీసుకున్నాను అని లక్ష్మణ్ తెలిపారు. ఈ విషయాలు మాట్లాడుతూ తనకు నెలకు రెండు లక్షల పైగా శాలరీ అందుతున్నట్లు వెల్లడించారు. దాంతో ఈ విషయాన్ని అల్లు అర్జున్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news