Newsయానిమ‌ల్ పోస్ట‌ర్‌.. అర్జున్ రెడ్డిని కాపీ కొట్టేసి అడ్డంగా దొరికేసిన సందీప్...

యానిమ‌ల్ పోస్ట‌ర్‌.. అర్జున్ రెడ్డిని కాపీ కొట్టేసి అడ్డంగా దొరికేసిన సందీప్ వంగా…!

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌, నేష‌న‌ల్ క్ర‌ష్మిక ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న సినిమా యానిమ‌ల్‌. తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న యానిమ‌ల్‌పై బాలీవుడ్‌తో పాటు ఇటు సౌత్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్రి టీజ‌ర్‌ను మేక‌ర్స్ ఇప్ప‌టికే రిలీజ్ చేయ‌గా.. తాజాగా మేక‌ర్స్ మ‌రో ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ కూడా రివీల్ చేశారు. ఓ ప్రి రొమాంటిక్ పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌దిలారు. యానిమ‌ల్ ఫ‌స్ట్ సింగ‌ల్ రిలీజ్ గురించి అప్‌డేట్ ఇవ్వ‌డంతో పాటు ఫ‌స్ట్ సాంగ్ అక్టోబ‌ర్ 11న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

తెలుగులో అమ్మాయి అనే టైటిల్‌తో పాటు ఈ సాంగ్ రిలీజ్ కానుంది. తాజా పోస్ట‌ర్‌లో ర‌ణ‌బీర్ – ర‌ష్మిక మూతిముద్దు ఇచ్చుకుంటోన్న పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌దిలారు. ఇది సోష‌ల్ మీడియాను ఇప్పుడు పిచ్చ‌పిచ్చ‌గా షేక్ చేస్తోంది. ర‌ష్మిక – ర‌ణ‌బీర్ ఆకాశంలో లిప్ లాక్ చేసుకుంటోన్న పోస్ట‌ర్ వ‌దిలారు. అయితే నెటిజ‌న్లు ఈ ఫొటోను అర్జున్ రెడ్డి సినిమాలో షాలిని పాండే – విజ‌య్ మూతిముద్దు పెట్టుకుంటోన్న పోస్ట‌ర్‌తో కంపేరిజ‌న్ చేస్తున్నారు.

అప్పుడు ఆ పోస్ట‌ర్‌తో అర్జున్‌రెడ్డి సినిమాపై అంచ‌నాలు పెంచేసిన విజ‌య్ ఇప్పుడు ఈ సినిమాతోనూ లిప్‌లాక్ సీన్ సెంటిమెంట్ తో సినిమాపై అంచ‌నాలు పెంచేసిన‌ట్టుగానే ఉంది. యానిమ‌ల్ సినిమా డిసెంబ‌ర్ 1, 2023న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇండియాలోనే ఐదు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news