News' స‌లార్ ' ముద్దు... ' డంకీ ' వ‌ద్దంటోన్న క్రేజీ...

‘ స‌లార్ ‘ ముద్దు… ‘ డంకీ ‘ వ‌ద్దంటోన్న క్రేజీ హీరోయిన్‌.. ప్ర‌భాస్‌ను లేపేస్తోందిగా…!

మాళవిక మోహన్ ఈ మలయాళ బ్యూటీ తెలుగులో చేసింది ఒక సినిమా అయినా.. ఆమె అందానికి ఫిదా కానీ ప్రేక్షకులు లేరు. విజయ్ – లోకేష్ కనగ‌రాజ్‌ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా తన అభిమానులను పలకరించారు. వారు అడిగిన పలుకు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు.

ఈ క్రమంలోనే తన కొత్త సినిమాల రిలీజ్ గురించి అడగ్గా ఆ విషయం దర్శకుడిని అడగాలని క్లారిటీగా చెప్పేశారు. ప్రభాస్ స‌లార్ – షారుక్ ఖాన్ ఢంకి రెండు సినిమాలలో ఏ సినిమా చూడాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు తనకు రెండు సినిమాలు చూడాలని ఉందని.. ఏదో ఒక్క సినిమా ఎంపిక చేసుకోవాలని అంటే నా ఆన్సర్ ఖచ్చితంగా సలార్ అని కుండబద్దలు కొట్టేసింది. సలార్‌ సినిమా టీజర్ నాకు బాగా నచ్చిందని మాళవిక తెలిపింది.

మా అమ్మ చేసే ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అంటే తనకు ఎంతో ఇష్టం అని.. తంగలాన్ సినిమాలో తాను పోషించిన పాత్ర మీకు చాలా నచ్చుతుందని మాళవిక చెప్పింది. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న ప్రశ్నకు ఈ విషయాన్ని దర్శకుడు పా. రంజిత్ ని అడగాలని.. ప్ర‌భాస్‌ తన ఫేవరెట్ యాక్టర్ అని చెప్పిన ఆమె ఒక పిరియాడికల్ సినిమాలో రాజకుమారిగా, రాణిగా నటించాలన్నదే తన కోరిక అని.. అదే తన డ్రీమ్ రోల్ అని మాళవి కాకుండా బద్దలు కొట్టింది.

బైక్స్‌ ఇష్టపడే వారు ఎవరైనా హీరో అజిత్ ను ఇష్టపడతారని.. ఈ క్రమంలో తాను కూడా ఇష్టపడతానని తెలిపారు. విజయ్ నటించిన సినిమాలలో మాస్టర్ కాకుండా తేరి ( తెలుగులో పోలీసోడు) సినిమా తనకు చాలా ఇష్టం అని తెలిపింది. ఇక విక్రమ్ హీరోగా పా రంజిత్ తెరకెక్కిస్తున్న తంగలాన్ సినిమాలో మాళవిక హీరోయిన్. కర్ణాటకలోని కోలార్ బంగారు గని కార్మికుల జీవితాల‌ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news